ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 1:12 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

అంబటి అడ్డంగా బుక్కైనట్టేనా

అంబటి అడ్డంగా బుక్కైనట్టేనా.

గుంటూరు, సెప్టెంబర్ 23, (అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 23.)

లిక్కర్ స్కామ్‌లో ఈడీనోటీసులు ఇస్తే 90 ఎంఎల్ డైలాగులు చెప్పిన అంబటి రాంబాబుకు అసలు నిజం తెలుసు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడంతో ఆయన గారికి అసలు భయం పట్టుకుంది. తొలుత ఈడీ నోటీసులే రాలేదని, తనకేమీ తెలియనట్లు అమాయకపు నటన ప్రదర్శించిన అంబటి.. తీరా విషయం ముదిరి పాకాన పడటంతో నాకేం భయం లేదు.. ఆరోగ్యం కుదుటపడ్డాక విచారణకు వెళ్తా అంటూ కొత్త కవరింగ్ కథనాలు మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన దందాపై పూర్తి సాక్ష్యాలు ఈడీ వద్ద ఉన్నాయి.అంబటి రాంబాబు ఎంత నాటకమాడినా మద్యం కుంభకోణంలో ఆయన పాత్రను దర్యాప్తు సంస్థలు పక్కా ఆధారాలతో పట్టుకున్నాయనేది బహిరంగ రహస్యంగా మారింది. అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీ ఎత్తున సాగిన మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. మద్యం విధానంలో జరిగిన అవకతవకలు, నిధుల మళ్లింపు, మనీలాండరింగ్ కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా ఆయనను ఆదేశించింది.ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా, విక్రయాల ప్రక్రియలో అంబటి రాంబాబు పాత్రపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మద్యం అక్రమ రవాణాకు సంబంధించిన సబ్ కాంట్రాక్టులను నిబంధనలకు విరుద్ధంగా అంబటి బినామీ సంస్థలకు కట్టబెట్టారనే అభియోగాలు దర్యాప్తులో తెరపైకి వచ్చాయి. మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు ఎలా మళ్లాయి, వాటి వెనుక ఉన్న బినామీ నెట్‌వర్క్, డొల్ల కంపెనీల ఆర్థిక లావాదేవీలపై అధికారులు లోతైన ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పీఎంఎల్ఏ చట్టం కింద అంబటికి నోటీసులు జారీ చేసి సమగ్ర వివరణ కోరింది.ఈ నోటీసుల వ్యవహారాన్ని అంబటి దాచి పెట్టే ప్రయత్నం చేశారు. రెండు వారాలుగా అనారోగ్య కారణాలతో తాను హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నానని, ఈ క్రమంలోనే ఈడీ అధికారులు ఫోన్ చేసి ఈనెల 11నే నోటీసులు పంపినట్లు చెప్పారని ఆయన పేర్కొన్నారు. అయితే నోటీసులు చేతికి రాకపోవడం వల్లే విచారణకు రాలేకపోయానని, ఏ కేసులో నోటీసులు ఇచ్చారనేది పత్రాలు చూస్తే తప్ప స్పష్టత రాదని అధికారులకు తెలిపినట్లు సమాచారం. మరోవైపు, ఈవారంలోనే హైదరాబాద్ , విజయవాడలోని ఈడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఏపీ లిక్కర్ స్కామ్‌పై ఓవైపు రాష్ట్ర సిట్ , మరోవైపు ఈడీ దర్యాప్తును ముమ్మరం చేస్తుండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులు, ప్రజాప్రతినిధులు దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటున్నారు. కారుమూరి, ఆయన కుమారుడు జైలు పాలయ్యారు. అంబటి తనకేమీ సంబంధం లేదని బుకాయించే ప్రయత్నం చేసినా.. ఆధారాల్లేకుండా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉండదు.జగన్ హయాంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన బినామీలుగా ప్రచారంలో ఉన్న సుబ్బారెడ్డి, పురుషోత్తం అనే వ్యక్తులను రంగంలోకి దించిన అంబటి.. వారికి మద్యం సరఫరా, డిస్ట్రిబ్యూషన్ కాంట్రాక్టులు కట్టబెట్టారని విచారణలో తేలినట్లు సమాచారం. ఆ కాంట్రాక్టర్ల వద్ద నుంచి భారీ ఎత్తున కమిషన్లు, నిధులు దండుకున్న వైనంపై సిట్, ఈడీలకు సదరు బినామీలే స్వయంగా పూసగుచ్చినట్లు వివరాలు ఇచ్చేశారని, డబ్బులు ఎలా మార్పిడి జరిగాయో ఆధారాలతో సహా అప్పగించారని ప్రచారం జరుగుతోంది.అంబటి గారు అడ్డంగా దొరికిపోవడంతోనే ఇప్పుడు అసలైన వణుకు మొదలైంది. ఇప్పటికే నేతలు కారుమూరి నాగేశ్వరరావు లాంటి వారు జైలు బాట పట్టిన దృశ్యాలు కళ్లముందు కదులుతుండటంతో, ఎక్కడ ఈడీ అధికారులు తనను కూడా నేరుగా అదుపులోకి తీసుకుని రిమాండ్ కార్డ్ ఇస్తారోనని ఆయన భయాందోళనకు గురవుతున్నారు. సాధారణ పోలీసు కేసుల్లా కాకుండా, ఈడీ చట్టం కింద అరెస్ట్ అయితే అంత సులువుగా బెయిల్ రాదని, ఎంతటి వారికైనా కటకటాలు తప్పవని తెలిసి ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.టివి ఛానళ్లలో ఎదుటివారిపై పంచ్‌లు వేస్తూ, వెటకారాలతో కాలక్షేపం చేసిన అంబటి రాంబాబుకు.. ఇప్పుడు తన సొంత బినామీలే ఇచ్చిన వాంగ్మూలాలు పెద్ద ఉచ్చుగా మారాయి. మైకుల ముందు నాకేం భయం లేదు అని ఎంత గంభీరంగా నటించినా, లోలోపల మాత్రం ఈడీ అరెస్ట్ వారెంట్ ఎప్పుడు తలుపు తడుతుందోనని బెదిరిపోతున్నారనేది స్పష్టమవుతోంది. గతంలో నడిపిన లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే, ఈడీ విచారణ నుంచి తప్పించుకోవడానికి ఆరోగ్యం సాకుగా చూపే కవరింగ్ డ్రామాలు ఇకపై చెల్లకపోవచ్చు.